Monday, October 26, 2026

విలేకరులది… చెత్త ఉద్యోగం..!

  • అతి చెత్త ఉద్యోగాల జాబితాలో ఐదో స్థానం..
  • అమెరికన్ కన్సల్టెన్సీ రేటింగ్
  • బెస్ట్ జాబ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్!

న్యూయార్క్ అక్టోబర్ 26(ద్రోణ):-

ఎవరో సెలెబ్రిటీ వస్తున్నారంటే ఊరు పొద్దెక్కకముందే అక్కడికెళ్లి పడిగాపులు కాయాలి. బైట్లకోసం పాట్లు పడాలి. వాళ్లు దయదలచి ఒక్కముక్క మాట్లాడితే.. అదే పరమానందం అనుకోవాలి.

పదే పదే ప్రసారం చేసుకోవాలి. పత్రికలో అయితే మిగతావాళ్ల కన్నా బాగా సంచలనాత్మకం ఎలా చేయాలో ఆలోచించుకోవాలి. ఖర్మకాలి, సదరు ప్రముఖుడో/ప్రముఖురాలో ఏమీ మాట్లాడకపోతే.. ఆ మాత్రం మాట్లా డించలేవా” అంటూ ఆఫీసులో బాసు చెడుగుడు ఆడేస్తాడు. ఇలా విలేకరుల కష్టాలు అన్ని ఇన్ని కావు! అందుకే అమెరికాకు చెందిన కెరీర్ కాస్ట్ అనే కన్స ల్టెన్సీ సంస్థ.. టాప్ టెన్ అతి చెత్త ఉద్యోగాల జాబితాలో రిపోర్టర్ ఉద్యోగానికి ఐదో స్థానం ఇచ్చింది. ఈ ‘చెత్త ఉద్యోగాల జాబితా’లో రిపోర్టర్లకు అటూఇటూ ఉన్నది రెస్టారెంట్లో వెయిటర్లు, అంట్లు తోమేవాళ్లు, మాంసం కొట్టేవాళ్లు, చెట్లు కొట్టేవాళ్లు. ఆయిల్ రిగ్గుల్లో కార్మికులు. ఆ సంస్థ విడుదల చేసింది చెత్త ఉద్యోగాల చిట్టా మాత్రమే కాదు. 2012 సంవత్సరానికి గాను 200 ఉద్యోగాలకు అత్యుత్తమం నుంచి అతిచెత్త దాకా రేటింగ్ ఇచ్చింది. యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు.. ఆయా ఉద్యోగాలకు అవసరమయ్యే శారీరక శ్రమ, పనిచేసే వాతావరణం, ఆదాయం, ఒత్తిడి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రేటింగ్ ఇచ్చింది. ఇందులో టాప్ 1.. అనగా అత్యుత్తమ ఉద్యోగం ఏంటో తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏడాదికి రూ.40 లక్షల దాకా జీతం (ఇది అమెరికా ప్రమాణాల ప్రకారం), తక్కువ శారీరక శ్రమ, ఒత్తిడి కూడా తక్కువే ఉండటం ఈ ఉద్యోగంలో ఉండే మంచి లక్షణాలట. ఇంటర్నెట్లో సమాచారం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుండటంతో.. పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు క్రమేపీ ఆదరణ తగ్గుతోంది. నిజానికి ఈ రెండు రంగాల్లో ఉద్యోగం అంటే ఒకప్పుడు బాగా క్రేజ్ ఉండేది. కానీ., రిపోర్టర్ ఉద్యోగంలో పెరుగుతున్న ఒత్తిడి, తగ్గుతున్న అవకాశాలు, తక్కువ ఆదాయం వంటివి దీన్ని చెత్త ఉద్యోగాల జాబితాలోకి చేర్చాయని కెరీర్ కాస్ట్ తన నివేదికలో పేర్కొంది. ఇక అత్యంత ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాల జాబితా ఇది… సైనికులు. అగ్నిమాపక సిబ్బంది. విమాన చోద కుడు, మిలటరీ అధికారి, పోలీస్ అధికారి, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ప్రజా సంబంధాల అధికారులు, సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, ఫొటో జర్నలిస్టులు, టాక్సీ డ్రైవర్లు, టాప్ టెన్ బెస్ట్ ఉద్యోగాలు… సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీమా విపణులు హెస్ఆర్ మేనేజర్ దంత వెద్యులు పెనానియల్.

ఇక అత్యంత ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాల జాబితా ఇది.. సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, విమాన చోద
కుడు, మిలటరీ అధికారి, పోలీస్ అధికారి, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ప్రజా సంబంధాల అధికారులు, సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, ఫొటో జర్నలిస్టులు, టాక్సీ డ్రైవర్లలను గుర్తించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular