Friday, October 30, 2026

అమ్దాపూర్ సొసైటీ పగ్గాలు సూర రవికి

రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా…

నూతన చైర్మన్ వెల్లడి…

బోధన్, ప్రతినిధి అక్టోబర్ 30 (ద్రోణ): అమ్దాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్‌గా సూర రవి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం సందడిగా సాగింది.

చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సూర రవికి రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. సంఘ డైరెక్టర్ లను సైతం శాలువాలతో సత్కరించారు.

సహకార సంఘం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నూతన చైర్మన్ కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. రైతుల సమస్యల పరిష్కారం, వారి అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఈ సందర్భంగా సూర రవి మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమం, అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, సాలూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్న రవి, సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, వివిధ సహకార సంఘాల చైర్మన్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంఘ సీఈఓ రాజేశ్వర్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular