పహల్గాం దాడి తర్వాత పాక్‌కు భారత్ ఆహ్వానం!
న్యూఢిల్లీ, అక్టోబర్ 29 (ద్రోణ): భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పహల్గాం దాడి తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం పంపినట్లు సమాచారం. నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్‌కు పాకిస్థాన్ సాంస్కృతిక మంత్రి ఔరంగజేబ్ ఖాన్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఎస్‌సీఓలోని పది సభ్య దేశాలకు భారత్ ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర అవగాహనను పెంపొందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపినట్లు వచ్చిన వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, ఈ పరిణామం భారత్–పాక్ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాల్సి ఉంది. సాంస్కృతిక సహకారానికి వేదికగా నిలవనున్న ఈ సదస్సులో సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని, పరస్పర సంబంధాల బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది.
