Thursday, October 29, 2026

ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదంగా జీవించాలి

నిజామాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 28 ద్రోణ:-

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సి.సి.యస్ పోలీస్ స్టేషన్ యందు నిజామాబాద్‌ జిల్లా ట్రాన్స్‌జెండర్లకు సి.సి.యస్ ఏసీపీ శ్రీశైలం కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఏసీపీ శ్రీశైలం మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా , న్యూసెన్స్‌కు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించేందుకు కృషి చేయాలని , చట్టవిరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న వ్యక్తిగత , సామాజిక సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత మార్గాల్లో సహాయం పొందాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్టాన్ని ఆశ్రయించాలని , ఎవరూ నిరుత్సాహానికి గురికాకుండా గౌరవప్రదమైన జీవనం కొనసాగించాలని తెలిపారు.

ట్రాన్స్‌ జెండర్లకు ఏవైనా సమస్యలు , ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14427ను సంప్రదించాలని సూచించారు. ప్రజలల్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు , ట్రాన్స్‌ జెండర్ల సమస్యలను తెలుసుకొని వారికి తగిన మార్గదర్శకత్వం అందించడమే ఈ కౌన్సెలింగ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.


ఈ సందర్భంగా సిసిఎస్ సీఐలు సురేష్ , అజయ్ , సాయినాథ్ , ఎస్సైలు మహేష్ , భీమ్రావు , మహిళ ఆర్ఎస్ఐ స్రవంతి , సఖీ సెంటర్ ఇన్చార్జి భానుప్రియ మరియు జిల్లాలోని ట్రాన్సజెండర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular