నలుగురి అరెస్టు, ఇద్దరు పరారీ…
సి ఎం ఆర్ ఎగవేతతో కేసుల నమోదు…
నిజామాబాద్,అక్టోబర్ 27(ద్రోణ):-
నిజామాబాద్ జిల్లాలో తోలి సారి సిఐడి అధికారులు మిల్లర్ల పై దాడులు నిర్వహించారు. అదివారం తెల్లవారు జామున నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలలో మిల్లులు నిర్వహిస్తున్న నలుగురు మిల్లర్లను అరెస్ట్ చేశారు.

మరో ఇద్దరు మిల్లర్లు పరారీ అయ్యారు. సిఐడి డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఐడి డిఎస్పీ, ఇద్దరు సిఐలు, ఇద్ధరు ఎస్ఐల టీంకు తోడుగా లోకల్ పోలీసులను కలుపుకొని దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మిల్లర్లు వందల కోట్ల రూపాయల సిఎంఆర్ ఎగవేత చేసిన ప్రముఖ మిల్లర్లపై సి ఐ డి నజర్ వేసింది. అందులో భాగంగా పద్మవతి ఆగ్రో ఇండస్ట్రీస్ కు చెందిన లాబిశెట్టి గంగాప్రసాద్, వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమానీ పోట్ల అంజయ్య, శ్రీవాణి ట్రెడింగ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అదినేత బోందుగుల దేవేందర్, మాస్టర్ బిహెచ్ యుడిఐ ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్ కు చెందిన లాబిశేట్టి శ్రీకాంత్ లను తెల్లవారు జామున వారి ఇండ్లలోనే అరెస్టు చేశారు. ముకుందా క్రిష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ కు చెందిన వనపర్తి సూర్యానారాయణ, ఆనుపమ ఆగ్రో ఇండస్ట్రీస్ కు చెందిన కిసా అనుషలు పరారీలో ఉన్నారని సిఐడి అధికారులు తెలిపారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మిల్లర్లను ఉదయం వెళ అరెస్టు చేయడం మిల్లర్లలో అలజడి చెలరేగింది. చాలమంది మిల్లర్లు అరెస్ట్ చేసింది ఎవ్వరో తెలియక లోకల్ పోలిస్ స్టేషన్ లకు పరుగులు తీశారు. కాని వచ్చింది సిఐడి అధికారులను తెలిసి ఎవరికి వారే తోకముడిచారు.

జిల్లాలో మొదటిసారి…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణకు దాన్యగారంగా ప్రసిద్ధి చెందింది. దాన్యం పండిచడంలో, సేకరణలో ఎప్పుడు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి జిల్లాలో మిల్లర్లు కస్టం మీల్లింగ్ రైస్ (సి ఏం ఆర్) కోసం దాన్యంను సివిల్ సప్లై శాఖ తీసుకోవడం, బియ్యంగా మార్చి ఎఫ్‌సిఐకి సిఎంఆర్ ఇవ్వాలి. కానీ సి ఏం ఆర్ ఇవ్వకుండా ఎగవేయడం పరిపాటిగా ఇక్కడ మారింది. గత ప్రభుత్వం నుంచి ఈ తరహ దందాకు ఉమ్మడి జిల్లా పెరుగాంచింది. దానికి తోడు మిల్లర్లు అధికార పార్టి నేతల కనుసన్నులలో ఉండటంతో కోట్ల రూపాయల చెల్లించి ఇచ్చిన వడ్లను మర అడించకుండానే, బహిరంగ మార్కేట్ లో అమ్ముకున్నారు. అలాగే ధర ఎక్కువగా ఫలికే రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ల పెద్దగా పట్టించుకోలేదు. సీఎంఆర్ ఎగవేతలో మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. కాని వారు న్యాయస్థానంను అశ్రయించి ఉపశమనం పొందడం, ప్రతిసీజన్ లో మళ్లి దాన్యం దక్కించుకోవడం రివాజుగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పడిన ఆనంతరం సీఎంఆర్ ఎగవేత దారులకు అండగా అధికార పార్టి నేత ఉండటంతో డిపాల్డర్ లుగా గుర్తించి కేసులు, రెవిన్యూ రికవరి యాక్ట్ లకు పరిమితం అయ్యాయి. కానీ తోలిసారి సిఐడి అధికారులు దాడులు జరుగడంతో మిల్లర్లు ఉలిక్కి పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 350 పైగా రైస్ మీల్లులు ఉండగా దాదాపు రూ.750 కోట్ల దాన్యం మిల్లర్ల వద్ద
పెరుకుపోయింది. గత ప్రభుత్వం హయంలో ప్రారంభమైన సీఎంఆర్ ఎగవేత యుదేచ్చగా సాగుతుంది. విజిలేన్స్ దాడులలో మిల్లులో లోటు సీఎంఆర్ వెలుగు చూసిన అధికార పార్టి నేతల ఓత్తిడితో వారిపై ఉమ్మడి జిల్లాలో చర్యలు అధికారులు వెనుకంజ వేశారు.

కామారెడ్డిలోనూ…
కామారెడ్డి జిల్లాలో కేసులు నమోదు, అరెస్ట్ లు జరిగిన, నిజామాబాద్ లో అఉసే లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అదేశాల మేరకు సివిల్ సప్లె అధికారుల పిర్యాదు తో కోట్ల రూపాయాల సిఎంఆర్ ఎగవేత దారులపై సిఐడి దాడులు చేసి అరెస్టు చేస్తుండటం మిల్లర్లకు మింగుడు పడటం లేదు.2014 లొ బోధన్ కేంద్రంగా వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన నకిలి చాలన్ ల 1200 కోట్ల కుంభకోణం జరిగినప్పుడు సిఐడి అందరితో పాటు మిల్లర్లను విచారించింది సిఐడి. దాదాపు పుష్కర కాలం తరువాత సీఎంఆర్ కుంభకోణంలో మిల్లర్లను అరెస్ట్ చేసి విచారిస్తుండటం విశేషం. అనాడు కేసుల నమోదుతో నకిలి చాలన్ లో ప్రమేయం ఉన్నవారు సంబంధిత సోమ్మును ఖజానకు చెల్లించి బయటపడ్డారు. ఈసారి కోట్ల రూపాయల సిఎంఆర్ ను మెక్కేసిన మిల్లర్లు సిఐడి విచారణ ను ఎలా ఎదుర్కుంటారో వెచి చూడాలి.
9848680568
