Wednesday, October 28, 2026

నాగేశ్వరరావు నియామకంపై హర్షం..

ఆచన్‌పల్లిలో ఘన సన్మానం

బోధన్, అక్టోబర్ 28 (ద్రోణ): బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన నాగేశ్వరరావును ఆచన్‌పల్లి నాయకులు, కాలనీ పెద్దలు ఘనంగా సన్మానించారు. గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

బోధన్‌లోని 1వ వార్డు ఆచన్‌పల్లి ప్రజల తరఫున నాగేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన నియోజకవర్గ స్థాయి పదవిని చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతులతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధికి తనవంతు సేవలు అందించాలని ఆకాంక్షించారు.

రైతుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వార్డు పెద్దలు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్మూర్తి, విజయ్, సాంబిరెడ్డి, చింటూతో పాటు ఆచన్‌పల్లి కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular