
పోలీసులకు ఫిర్యాదు
బోధన్, ప్రతినిధి అక్టోబర్ 30 (ద్రోణ):- నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలోని జగజ్జనని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న బలిపీఠాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బోధన్ రూరల్ ఎస్‌హెచ్‌ఓ ఎం. రాజశేఖర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు అందజేశారు. ఆలయం వద్ద బలిపీఠాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్: ఎం. నాగేశ్వరరావు
9848680568
