Friday, October 30, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరు బలి..

మరొకరి పరిస్థితి విషమం

కోటగిరి, అక్టోబర్ 30 (ద్రోణ):- నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్‌పూర్‌ శివారులో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిషన్‌ హార్వెస్టర్‌ను బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో కోటగిరి నుంచి దోమలెడిగి గ్రామానికి చెందిన వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా, యాద్గార్‌పూర్‌ శివారులో ఎదురుగా వస్తున్న మిషన్‌ హార్వెస్టర్‌ను ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటగిరి ఎస్సై శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular