మానవత్వం చాటిన డ్రైవర్, కండక్టర్

బాధ్యతతో వ్యవహరించిన ఆర్టీసీ సిబ్బంది…

బాధితురాలికి రూ.87 వేల నగదు అప్పగింత

బోధన్, నవంబర్ 05 (ద్రోణ):- ప్రయాణికురాలు బస్సులో మరిచి పోయిన రూ.87 వేల నగదును ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ చొరవతో తిరిగి అందజేసిన ఘటన బోధన్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన సంధ్య అనే మహిళ బోధన్‌లోని బ్యాంకులో జమ చేసేందుకు రూ.87 వేల నగదును కవర్‌లో పెట్టుకుని గురువారం బస్సులో ప్రయాణించారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో శక్కర్ నగర్ సమీపంలో బస్సు దిగే క్రమంలో నగదు ఉన్న కవర్‌ను సీటు పైనే మరిచిపోయి వెళ్లిపోయారు.

కొద్దిసేపటికే విషయం గుర్తించిన ఆమె వెంటనే బోధన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు, అప్పటికే దేగ్లూర్ వైపు వెళ్తున్న సదరు బస్సును గుర్తించి డ్రైవర్ సలీం, కండక్టర్ హనుమాన్‌ల సహకారంతో తనిఖీ చేయించారు. ఈ క్రమంలో సీటు పై మరిచి పోయిన రూ.87 వేల నగదు కవర్ లభించింది.

అనంతరం డ్రైవర్, కండక్టర్ నగదును భద్రంగా బాధితురాలికి తిరిగి అందజేశారు. నగదు సురక్షితంగా తిరిగి లభించడంతో సంధ్య ఆనందం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ సిబ్బందికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతా యుతంగా వ్యవహరించిన డ్రైవర్, కండక్టర్‌ను పలువురు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular