కల్దుర్కి పాఠశాలకు తిరిగి వెళ్లనున్న బోధన్ ఎంఈఓ నాగయ్య

బోధన్, నవంబర్ 10 ( ద్రోణ):- ఆరోగ్య సమస్యలు విధుల నిర్వహణకు ఇబ్బందిగా మారడంతో బోధన్ మండల విద్యాధికారి (ఎంఈఓ) ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఏ. నాగయ్య నిర్ణయించుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో అదనపు బాధ్యతలను కొనసాగించలేనని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం బోధన్ మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నాగయ్య, ఆ బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం తన పూర్వ విధులల్లో కి చేరనున్నారు. కల్దుర్కి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తిరిగి విధులు నిర్వర్తించనున్నారు.
బాధ్యతలు నిర్వహిస్తూనే మండల విద్యాశాఖ పర్యవేక్షణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించిన నాగయ్య, ఆరోగ్య కారణాలతో ఇంచార్జ్ పదవికి దూరం కావాలని నిర్ణయించుకోవడం విద్యాశాఖ వర్గాల్లో చర్చకు దారితీసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular