రంగారెడ్డి కలెక్టర్కు జైలు శిక్ష

రూ.2 వేల జరిమానా
రంగారెడ్డి నవంబర్10( ద్రోణ):- కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అదనంగా రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయక పోవడం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, ఈ తీర్పు పై పైకోర్టులో అప్పీల్ చేసుకు నేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది. ఈ వ్యవధిలో సంబంధిత అధికారి అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.