రాష్ట్రస్థాయి పోటీల ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ స్పోర్ట్స్ కోచ్‌ల బృందం
నిజామాబాద్, నవంబర్ 10( ద్రోణ):- 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలు–2026 ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో నుంచి తరలి వచ్చే పోలీస్ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగా కుండా అన్ని విభాగాలలో ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
ఈ క్రమంలో ఐజీ స్పోర్ట్స్ విభాగానికి చెందిన వివిధ క్రీడా విభాగాల కోచ్‌ల బృందం జిల్లాలో పర్యటించి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వాటర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, స్విమ్మింగ్, ఆర్చరీ తదితర పోటీల నిర్వహణకు అవసర మైన వసతులను సమీక్షించింది. క్రీడా మైదానాలు, సామగ్రి, సాంకేతిక సదుపాయాలు, భద్రతా చర్యలు, పోటీల నిర్వహణకు సంబంధించిన అంశాల పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కోచ్‌లు అందించిన సూచనల మేరకు ఏర్పాట్లను మరింత మెరుగు పరచాలని సంబంధిత అధికారులకు సూచించింది.
అనంతరం కోచ్‌ల బృందం పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, (ఐపీఎస్) ను మర్యాద పూర్వకంగా కలిసి పోటీల నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన ఏర్పాట్ల పై కమిషనర్ సమీక్షించారు. ప్రతి క్రీడా విభాగం అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఇతర జిల్లాల నుంచి వచ్చే క్రీడా కారులకు నాణ్యమైన వసతులు కల్పించడంతో పాటు పోటీలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా వేడుకలకు నిజామాబాద్ ఆతిథ్యం ఇస్తున్నందున ఈ కార్యక్రమాన్ని ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్ముడ్ రిజర్వ్ ఏసీపీ శ్రీ కృష్ణ, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ నరేందర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ధరణి కుమార్, శేఖర్ బాబు, ఐజీ స్పోర్ట్స్ విభాగం కోచ్‌లు పి. కృష్ణారావు, ఎన్. శ్రీనివాస్, ఎం.డి. బాబా, ఎం. రతన్ కుమార్, డి. సతీష్, డి. యామన్, ఎం.డి. మోసిన్, బొబ్బిలి నరసయ్య, కృష్ణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.