హైదరాబాద్ లోని రవింద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15 వ స్నాతకోత్సవ సమావేశంలో బాగంగా ఇటివల భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సామాన్య పేదకుటుంబానికి చెందిన హమాలి పని చేసుకుని జీవించే నోముల మొగిలి – రాద దంపతుల కుమారుడు నోమల రాజు జాంబ పురాణం,కథకుల కథలు – తులనాత్మక అద్యయనం అనే అంశంపై ఫ్రొపెసర్ భట్టు రమేష్ పర్యవేక్షణలో అద్యయనం చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ మరియు గోల్డ్ మోడల్ పొందారు.అందుకు సంబందించిన పట్టాను నిన్న రవింద్ర బారతీలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరీరాజన్ చేతుల మీదుగా నోముల రాజు అందుకున్నారు.ఈ సందర్బంగా గవర్నర్ అతన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు..
మారు మూల గ్రామంలో సామాన్యపేదకుటుంబంలో జన్మించి,చదువుపై ఉన్న మక్కువతో శ్రద్దగా చదివి నేడు గవర్నర్ చేతుల మీదుగా పీ.ఎచ్ డీ పట్టా,గోల్డ్ మెడల్ పొందడం పట్ల చల్లగరిగే గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న పేదింటి భిడ్డ నోముల రాజు..
RELATED ARTICLES