కోటగిరి లో ముస్లిం ఫకీర్ కుటుంబాలకు రంజాన్ కిడ్స్ పంపిణీ. కోటగిరి మండల కేంద్రంలోని చావిడి గల్లీకి చెందిన మైనార్టీ ముస్లిం ఫకీర్ 30 కుటుంబాలకు మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ హాకీమ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం పండగకు సంబంధించిన వస్తువుల కిడ్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్లపల్లి ఫారం గ్రామంలో పలు రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. వివిధ గ్రామాల్లో కూడా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా కానుకలను అందజేస్తున్నానన్నారు. ఈరోజు చివరి రోజు కనుక కోటగిరి చావిడి వద్ద 30 ఫకీర్ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 850 రూపాయల విలువచేసే పండగకు కావలసిన సామాన్లతో కిడ్స్ లను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ పేదవారికి ఆర్థిక సహాయం చేయడం ఎంతో అభినందనీయమని కొని యాడారు. ఎంతోమంది వ్యక్తుల వద్ద కోట్ల రూపాయలు డబ్బు ఉంటుంది కానీ కొందరికి మాత్రమే దానగుణం ఉంటుందని అన్నారు. ఆయన కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని ఎంపీటీసీ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
దసరా పండగ సందర్భంగా తాను కూడా హిందూ నిరుపేద కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయం చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎంసెట్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన అన్నారు. హకీం పుట్టిన గ్రామంలో స్కూల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ మధ్యాహ్న భోజనానికి ఆర్థిక సహాయం గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అదే కాకుండా వివిధ గ్రామాల్లో కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు .అలాంటి మనస్తత్వం కొందరికే ఉంటుందని ఆయన గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో బర్ల మధు, ఎజాస్ ఖాన్, యూత్ ప్రెసిడెంట్ అబ్దుల్ వాజి తదితరులు పాల్గొన్నారు.