నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని లాలన ఆశ్రమంలో ప్రతినిత్యం పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం పోలీసులకు అందడంతో ఆశ్రమంలో పేకాట ఆడుతున్న స్థావరంపై నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం దాడి చేశారు. ఎసిపి విష్ణుమూర్తి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సిఐ రవి తెలిపారు. పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 13వేల రూపాయలు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడిలో ఆర్మూర్ ఎస్సై అంజమ్మ, ఏఎస్ఐ లక్ష్మణ్, సిబ్బంది లక్ష్మణ్ సుదర్శన్ రాజేశ్వర్ రాములు, గజేందర్ అనిల్ నరసన్న సుధాకర్ లు దాడి చేపట్టిన వారిలో ఉన్నారు.