వడగళ్ళ వర్షం రైతన్నకు కడగళ్ళు
ప్రకృతి కన్నెర్ర తీరని నష్టం
భూమి పాలైన మామిడి
నేలరాలిన ధాన్యం
భీమా రైతుకు దీమా కరువు
ఫసల్ బీమా ప్రభుత్వాల నిర్లక్ష్యం
అంచనాలకే పరిమితమైన నష్టపరిహారం
రేవంతన్న ప్రభుత్వం కరుణించే నా?
గుండెలు బాధపడుతున్న రైతన్నలు
ఆరుగాలం కష్టించి పంటలను సాగు చేస్తున్న రైతన్నలకు ప్రతి ఏడాది వేసవిలో తిప్పలు తప్పడం లేదు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో పంటలు సాగుచేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సివస్తుంది. వేసవికాలంలో వడగళ్ల వర్షంతో పాటు పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు తప్పించుకోవడానికి రైతులు పంటల సాగులో కొన్ని మెలుకువలు తీసుకున్నారు. గతంలో మాసంలో ప్రకృతి కన్నెర్ర చేస్తూ ఉండేది. మనం మారినట్లుగానే ప్రకృతి కూడా తన చేష్టాలను మార్చుకొని మార్చి నుండి ఈదురుగాళ్లు వడగళ్ల వర్షం కురుస్తుంది. పంటల బీమాను రైతులు చెల్లిస్తున్నప్పటికీ బీమా మాత్రం రైతులకు పంటల సాగులో ధీమాను కల్పించడం లేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రైతన్నలు ప్రశ్నించి పంటలను పండించి చేతికందే తరుణంలో ప్రకృతి వైపరీత్యాలు రైతన్నలను వెంటాడుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. గత ఐదేళ్ల నుండి ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం చెల్లి గవ్వ కూడా విదల్చలేదు. పంటలు నష్టపోయిన సమయంలో పాలకులు, సంబంధిత శాఖ అధికారులు వ్యవసాయ క్షేత్రాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం నుండి నష్టపరిహారం చెల్లిస్తామంటూ రైతులకు భరోసా ఇవ్వడం వరకే ఇప్పటివరకు జరిగింది. రైతులకు ఓపక్క పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, మరోపక్క చేతికి అందిన పంటలు నోటికాడకి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర చేయడంతో పంటలు నేల పాలవుతున్నాయి. పంటల సాగుకు చేసిన అప్పులు, కుటుంబ పోషణ రైతు కుటుంబాలకు భారంగా మారుతుంది. తెలంగాణ రైతాంగం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ అన్న పై గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు.
వడగళ్ల వర్షం. రైతన్న కడగండ్లు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గత నెల వడగళ్ల వర్షం కురవడంతో రైతులు సాగుచేసిన వరి, మొక్కజొన్న, మామిడి లాంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతుకు రోకలి పోటు అన్న చందంగా ప్రకృతి వైపరీత్యాలు రైతులపై తాండవం చేస్తున్నాయి. సోమవారం సాయంత్రం నిజాంబాద్ జిల్లాలోని పోతంగల్, కోటగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో రాళ్ల వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వరి పంట కోతలు ఊపందుకున్నయి. 70% వరి పంట ఇప్పటికే చేతికింది. మరో 30 శాతం వరి పంట చేతికందాల్సింది. నోటి కాడికి వచ్చిన వరి పంట రాళ్ల వర్షానికి తీవ్రంగా దెబ్బతింది. పోతంగల్ మండలంలోని సుంకిని, సోంపూర్, టాక్లి, దోమలేడిగి శివారులో పంట తీవ్రంగా నేలరాలింది. నేలరాలిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చందూరు మండలంలో వడగళ్ల వర్షం పెద్ద ఎత్తున కురిసింది. ఆ ప్రాంతంలో సైతం వరి పంట తీవ్రంగా దెబ్బతింది. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఓదార్చారు. మరొ మరోపక్క నష్టపరిహారం ప్రభుత్వం నుండి అందించి తీరుతామని భరోసా ఇచ్చారు. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి అందించాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. మరొక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మేము ఏమి తక్కువ తినలేదు అన్న చందంగా ప్రజా ప్రతినిధులతో దెబ్బతిన్న పంటలను వారు కూడా పరిశీలించారు. ఇలా రైతులకు పరామర్శలు చేస్తూ పాలకులు, ప్రతిపక్షాలు కన్నీరు కారుస్తున్న రైతన్నకు ఆర్థిక సహాయాన్ని అందించి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు అందించి పంట నష్టం మాత్రం ఏనాడు చిల్లి గవ్వ విదల్చలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తెలంగాణ రైతాంగం గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వడగళ్ల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి రేవంతన్న కనికరం చూపించాలని రైతులు వేడుకుంటున్నారు.
పంటల బీమా ధీమా కరువు
పంటల బీమా చెల్లిస్తున్న రైతాంగానికి ధీమా కరువైంది. పంటల బీమా ను సరళికృతం చేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు అడ్డుపెట్టుకొని బీమా కంపెనీలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నాయి. ప్రతి చిన్న వ్యాపారికి భీమా చెల్లిస్తే నష్టపోయిన సందర్భాల్లో వెంటనే నష్టపరిహారం బీమా కంపెనీలు చెల్లిస్తాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం ప్రభుత్వాలు, భీమా కంపెనీలు కన్నేర్ర చేస్తున్నాయి. ప్రస్తుత పంటల బీమా చెల్లింపులో ఉన్న అడ్డంకులను తొలగించాలి. ప్రభుత్వాలు రైతుల కన్నా బీమా కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నాయన్న అనుమానాన్ని కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలోకి తీసుకువచ్చినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని నేటికి అమల్లోకి తేలేకపోవడం రైతులకు తీరం నష్టం వాటిల్లతోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తున్న రైతన్నలు ప్రతిరోజు ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు ఏమైందో అనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐదువేల ఎకరాల్లో పంట దెబ్బ తింటేనే పంటల బీమా వర్తిస్తుందని వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. పంటల భీమా పథకం లో ఉన్న లోపాలను సవరించి రైతులకు బీమా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. చేతిలో ఉండే ఫోన్ కు ఉన్న భద్రత రైతులు సాగు చేసిన పంటలకు మాత్రం భద్రత ఉండడం లేదు. ఒక సెల్ ఫోన్ కొనుగోలుదారుడు బీమా చేపిస్తే ఫోన్ పోయిన సందర్భాల్లో బీమా కంపెనీలు నష్టపోయిన లబ్ధిదారుడికి డబ్బు చెల్లిస్తుంది. ప్రతి చిరు వ్యాపారికి దిమానిస్తున్న భీమా కంపెనీలు రైతుకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నాయి. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతుకు వ్యక్తిగతంగా పంట నష్టం చెల్లించే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం పట్ల తెలంగాణ రైతాంగం వర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు చెల్లించాల్సిన భీమా డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని రేవంత్ అన్న ప్రకటించడం అభినందనీయమే. ప్రస్తుత తరుణంలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి రైతలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటుకోవాల్సిన అవసరం ఉంది.
నేలరాలిన మామిడి
ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలకు మామిడి పంట నేల రాళ్లతోనే ఉంది. ఏడాదికి ఒకసారి చేతికందే మామిడి పంట పింద దశ నుండి కాయలు పక్వానికి వచ్చేవరకు మామిడి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూనే ఉంటాయి.పంటల సాగులో మార్పిడి చేయాలని పండ్ల తోటలు పెంపకం చేపడితే రాయితీలు కల్పిస్తామని ప్రభుత్వాలు రైతులకు ఆశలు చూపుతున్నాయి. సాగు చేసేంతవరకు కొన్ని రాయితీలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. పంట చేతికందేదశలో ప్రతి ఏడాది ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం తాకిడికి తట్టుకోలేక మామిడి నేల రాలుతుంది. మామిడి తోటలను సాగుచేసిన రైతులు లబోదిబోమంటూ నష్టానికి కన్నీళ్లు కారుస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం పండ్ల తోటలను సాగుచేసిన రైతాంగానికి అండగా నిలబడడం లేదని రైతులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏడాదికి ఒక్కగాను ఒక్కసారి మామిడి పంట చేతికందుతుంది. మామిడి పూత దశ నుండి ప్రస్తుత ఏడాది ప్రకృతి వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. పూత దశలోనే క్రిమి కీటకాదులు తీవ్రంగా వ్యాప్తి చెందాయి. ఇప్పటికే నాలుగు నుండి ఆరుసార్లు బందులను చెట్లకు పిచికారి చేశారు. ఇంత చేసిన పూత పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కీటకాల దాటికి తట్టుకోలేక ఎక్కువ శాతం రాలిపోయింది. ఉన్న కొంత కింద కాయ దశలో మామిడి ఉంది. మరో నెల రోజుల్లో మామిడి కాయలు చేతికందుతాయన్న ఆశల్లో రైతులు తులతూగుతున్నారు. సోమవారం సాయంత్రం ఈదురుగాల్యులకు ఉన్న కాయలు పక్వానికి రాకముందే నేల రారాయి. ఏడాదిగా ఎదురుచూస్తున్న రైతాంగం కన్నీటి పర్యంతం అవుతున్నారు. మామిడి రైతులు కొంతమంది వ్యాపారులతో ముందస్తుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే తామేమీ చేయలేమని వ్యాపారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మామిడి రైతుల నష్టాన్ని పరిశీలన జరిపి నష్టపరిహారాన్ని అందించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఏనాడు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సోమవారం వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలరాలిన విషయం ఇప్పటికీ వ్యవసాయ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
రైతులను ఓదార్చిన ఏనుగు
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం దే అనే ధీమాతో ఆనాటి నుండి నేటి వరకు అన్ని తానై బాన్స్వాడ నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారు. ఎల్లారెడ్డి లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం పాలనా అనుభవం మెండుగా ఆయనకు ఉంది. నియోజకవర్గంలోని రైతులకు ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్నారు. పంటలు సాగు చేసిన రైతులకు నిజాంసాగర్ నీరందించడంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు ఎంతో కృషి చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో నీటి ఇబ్బందులను పరిష్కరించారు. గత 15 రోజుల క్రితం వర్షానికి నియోజకవర్గంలో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. అటువంటి పరిస్థితుల్లో నిజాంబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలను ఇన్చార్జి మంత్రి జూపల్లి పరిశీలన జరిపారు. నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకొని తీరుతుందని నష్టపోయిన రైతులకు ఎకరాకు 10000 నష్టపరిహారం మా ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రకృతి వైపరీత్యం కన్నెర్ర చేయడం రైతులకు తీరని నష్టం వాటిల్లింది. మంగళవారం ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి, పోతంగల్, చందుర్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఓదార్చారు. పంట నష్టం పరిస్థితులను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టపరిహారం చెల్లించేటట్లు చూస్తానని ఏనుగు రైతులకు హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు వ్యవసాయ క్షేత్రాలు పరిశీలించి నష్టపోయిన పంట వివరాలను నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి అందించాలని ఆయన అధికారులకు సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఏనుగు పనితీరుకు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గంపెడాశలతో ఉన్న బాన్సువాడ ప్రజలకు మరింత చేదోడు వాదోడుగా ఏనుగు సహకారం అందించాల్సిన అవసరం ఉంది.