తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని, పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో తలదూర్చితే పరిణామాలు ఘాటుగా ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.బిజెపి కుల,మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని చూస్తుంది.
దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనం.
రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు సీఎం గా ఉంటారు.కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది.
కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండేలు లేరు.కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు.అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాం.
ఏకనాథ్ షిండే ను సృష్టించిందే బీజేపీ.హరీష్ రావు,మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది.
బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే నేను దేనికైనా సిద్ధం అని మంత్రి సవాలు విసిరారు.మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దు.బండి సంజయ్ ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డి కి తెలుసా అన్ని ప్రశ్నించారు.