Wednesday, February 11, 2026

బగ్గుమన్న నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా మోదీ దిష్టిబొమ్మ దహనం

  • మోదీకి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు..
  • మోదివి బ్లాక్ మెయిల్ రాజకీయాలు..
    • మోదీ జేబులోనే ఐటి ఈడి ,సిబిఐ సంస్థలు..


ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితని కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ఈడి అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ శనివారం ధర్నా చౌక్ లో మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ఆదేశానుసారం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ
-ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఈడికి విడదీయ లేని బంధం ఉంది అని ఆరోపించారు.
జాతీయ సమస్తమైన ఐటి,ఈడి సిబిఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలను జేబులో పెట్టుకున్నారు. బిజెపి అధికారంలో లేని రాష్ట్రంలో మోడీ పర్యటిస్తున్నారంటే ఆయన వచ్చే ముందు ఐటి దాడులు చేసి భయంప్రాంతులకు గురి చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ నాయకులు మహిళ లోకం మండి పడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసేందుకు ఎమ్మెల్సీ కవితని అరెస్టు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు అరెస్టు చేయడం పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కుట్ర పూరితం ఏడాది క్రితం కవితకు సాక్షిగా నోటీస్ ఇచ్చి ఇప్పుడు అరెస్టు చేయడం ఏమిటని నిరసన తెలిపిన వారు ప్రశ్నించారు.

  • సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా అరెస్టు ఎలా చేస్తారు.
    ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలి, లేనిపక్షంలో బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అనీ హెచ్చరించారు.
    ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సిర్ప రాజు, ఉద్యమకారులు సుజాత్ సింగ్ ఠాగూర్, రవి చందర్, సత్య ప్రకాష్,నవీద్ ఇక్బాల్, విక్రమ్ గౌడ్,సాయి వర్ధన్,ప్యాట సంతోష్, విజయలక్ష్మి,ఆకాష్ ,శ్రీనివాస్ గౌడ్, మధు అపర్ణ, శోభావతి, సాయి వర్ధన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular