శాసనసభ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పిలుపునిచ్చారు.టిఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే
గణేష్ బిగాల మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నీరు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.నీరు లేక కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలోని పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు.
కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని పంపిణీ చేస్తున్నారు. తులం బంగారం ఇప్పటివరకు ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.అనేక సమస్యలతో ప్రజలు బాధలు పడుతుంటే ప్రజల సమస్యలు పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు.బిజెపి ప్రభుత్వం ఎంపీగా ఉన్న అరవింద జిల్లాకు చేసింది ఏమీ లేదు అన్నారు.పసుపు బోర్డు పేరుతో ఎంపీగా గెలిచిన అరవింద్ మళ్లీ అదే పేరుతో గెలవాలని చూస్తున్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు గెలవలేదు అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు.
కెసిఆర్ ని ఎందుకు గెలిపించుకోలేక పోయామని ప్రజలు మదన పడుతున్నారు .
అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించి ఢిల్లీలో గొంతును వినిపించాలనని గుప్తా పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలకు ఎంపీ సీట్లతో బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది అని అన్నారు.ఇప్పటికైనా ప్రజలు 6 గ్యారంటీలను ఇవ్వని ప్రభుత్వాన్ని నిలదీస్తూ పసుపు బోర్డు ఇవ్వని అరవిందును నిలదీస్తూ బాజిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి .
ఈ కార్యక్రమం లో మేయర్ దండు నీతూ కిరణ్ ,VG గౌడ్ ,సిర్ప రాజు,దారం సాయిలు, సుజిత్ ఠాకూర్,సుదాం రవిచందర్ సత్యప్రకాశ్, ప్రభాకర్ రెడ్డి,ఎనగందుల మురళి, పంచరెడ్డి సురేష్, ప్యాట సంతోష్,మధుకర్ రెడ్డి, విట్ఠల్,రామకృష్ణ,పవన్, తదితరులు పాల్గొన్నారు.