Monday, December 23, 2024

రంజాన్ పండగ రోజు కూలి గడప తట్టిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్.

రంజాన్ పండగ రోజు కూలి గడప తట్టిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్

పండుగ పూట.. పులకరించిన పేదోడి గుండె..!!

కూలి ఇంట్లో భోజనం చేసి సమస్యలు తెలుసుకొన్న ఎమ్మెల్యే

పేదోళ్ల వాడలో ఆకస్మికంగా వెళ్లి పండగ శుభాకాంక్షలు తెలుపడంతో
ఆనందంలో మునిగిపోయిన ముస్లిం వాడ

ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ రంజాన్ పండుగ రోజు ఆకస్మికంగా పేదోళ్ల వాడలో అడుగు పెట్టారు. కూలి చేసుకొని కాలం వెళ్ళ దీసే ముస్లిం కూలి గడప తట్టారు. కలలో కూడ ఊహించని విధంగా ఎమ్మెల్యే తమ వాకిట్లో ప్రత్యక్ష మవ్వడంతో పండగ పూట పేదోడి గుండె పులకరించిపోయింది. కూలి నాలి చేసుకొని మనుగడ సాగిస్తున్న ముస్లిం వాడ ఎమ్మెల్యే ను చూసి చిందులేసింది. ఈ అపురూప ఘటన గురువారం ఉట్నూర్ లో చోటు చేసుకొంది.నెల రోజుల ఉపవాసలా తరువాత గురువారం ముస్లింలు ఈదుల్ ఫితర్ పండుగ జరుపుకొన్నారు. ధనిక పేద తేడాలేకుండా ముస్లింలందరు తమ స్థాయిలో రుచికరమైన మైన వంటలు చేసుకొని పండుగ చేసుకొంటారు. అయితే ఆర్ధిక స్థోమత లేని పేదోళ్లు పండగ ఎలా జరుపుకొంటారో ప్రత్యేక్షంగా చూడాలని వారి వారి బాధలు వినాలానే ఆలోచన వచ్చిన వెంటనే ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ ఉట్నూర్ పట్టణంలోని మోమిన్ పుర పరిధిలో కడు పేదరికంలో ఉన్న ముస్లిం వాడకు వెళ్లారు. కడుపేధరికంలో ఉన్న అల్లా బకాష్ అనే కూలి ఇంటికి వెళ్లారు.ఆకస్మికంగా ఎలాంటి సమాచారం లేకుండా తమ వాకిట్లో అడుగు పెట్టిన ఎమ్మెల్యే ను చూసి పేద కుటుంబం పులకరించిపోయింది. ఎలాంటి సౌకర్యాలు లేని ఇంట్లో ఎమ్మెల్యేకు సకల మర్యాదలు చేసారు. ఇంటిల్లి పాదితో కలిసి ఎమ్మెల్యే భోజనం చేసారు. పాయసం తిన్నారు. వారి సమస్యలు విన్నారు. రెండు గదులున్న ఇంట్లో ఐదు కుటుంబాలు నివసిస్తున్నాయని అల్లా బకష్ ఎమ్మెల్యే కు తెలిపారు. తనకు పెన్షన్ రావడం లేదన్నారు. తాను ఉన్నానని ఎమ్మెల్యే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇంటి భూమితో పాటు ఇందిరమ్మ ఇల్లు,పెన్షన్ మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు.పేదోడి ఇంటికి ఎమ్మెల్యే వచ్చారని తెలిసి వాడ వాడంతా కదిలి వచ్చింది. వారి మొహాల్లో కొత్త ఆనందం వెల్లివిరిసింది. చిన్నా పెద్ద అందరు కలిసి ఎమ్మెల్యే తో కలిసి ఫోటోలు దిగారు. తమ జీవితానికి సరిపడే ఆనందం దొరికినట్టు సంబర పడ్డారు. వాడలో ప్రతి ఒక్కరిని కలిసి ఎమ్మెల్యే ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.గతంలో పండుగలు, పబ్బాల సమయంలో ఎమ్మెల్యేలు తమకు కావలసిన వారి ఇంటికి మాత్రమే వెళ్లే వారు. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ పేద కూలి ఇంటికి వెళ్లి వారి ఆనందంలో భాగ స్వామి కావడం,కనీసం మినరల్ వాటర్ కూడ దొరకని ఆ కుటుంబం ఇంట్లో భోజనం చేయడం చర్చనియంశం అయింది. పేదరికం స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన వెడ్మ భోజ్జు పటేల్ పేదల సంక్షేమం కోసం పరితపించడం హర్షనియమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular