వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు బోధన్ కమ్మ సంఘం మరియు శ్రీ కాకతీయ చేయూత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కమ్మ సంఘం అధ్యక్షులు పల్లెo పాటి శివ నారాయణ ప్రారంభించారు. కోట్లాది రూపాయలతో బోధన్ నుండి రుద్రూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన భవనాలను నిర్మించారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే నిరుపేదలకు ఉచితంగా విద్య, భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ పేరిట ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా బోధన్ కమ్మ సంఘం తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు.కమ్మ సంఘం పెద్దలు వారి స్థాయికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలలపాటు ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.