ఆనాటి సాంఘిక దురాచారాలను పారదోలి, స్త్రీలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయులని మాల మహానాడు అధ్యక్షులు చిన్న సాయన్న అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చేసిన సేవలను అణగారిన వర్గాలు ఎన్నటికీ మరువలేవని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆ రోజుల్లో ఉండే సాంఘిక దురాచారాలపై తీవ్రంగా పోరాడి ,స్త్రీ విద్య పై శ్రమించారన్నారు, తన భార్య అయిన మాత సావిత్రిబాయి పూలే ని బహుజన వాడలకు పంపించి స్త్రీల ను విద్యావంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు . కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు మీర్జాపురం చిన్న సాయన్న కాంగ్రెస్ పెద్దలు మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ కోటగిరి గ్రామ మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, కోటగిరి రెండో అధ్యక్షులు కూచి సిద్దు, పెద్దలు వల్లేపల్లి శ్రీనివాసరావు, బర్ల మధు, బ్యాగరీ రాములు కొత్తపల్లి సైదయ్య ,గంగాధర్ రావు దేశాయ్ ,పాల గంగారం దావులయ్య ఎమ్మార్పీఎస్ లాలు తదితరులు పాల్గొన్నారు.