దేశంలోని ప్రతి ఒక్కరు విద్యావంతులు కావడమే లక్ష్యంగా మాత్మ జ్యోతిరావు పూలే ఆశయంగా భావించారని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని బాన్సువాడ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా కన్వీనర్ నాగం సాయిలు కోరారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. నాగం సాయిలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే నిరుపేదలైనటువంటి ప్రజలందరూ విద్యావంతులు కావాలని సంకల్పంతో పేద ప్రజలందరినీ విద్యావైపు మళ్లించిన మహాగనుడు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పనులు మహాత్మ జ్యోతిరావు పూలే చేశారని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మక్కయ్య , కో కన్వీనర్ కాపుగండ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి హనుమాన్లు యాదవ్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి, బాన్సువాడ అర్బన్ రూరల్ అధ్యక్షులు తృప్తి శివప్రసాద్, దత్తాపురం సాయిబాబా, సీనియర్ నాయకులు చిదుర సాయిలు, డీజే సాయి, అశ్విన్, సిద్ధార్థ, గుడుగుట్ల అనిల్ కుమార్ కుల్కం గోపాల్, తోట శంకర్, సిద్ది బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు విద్యావంతులు కావడమే పూలే లక్ష్యం
RELATED ARTICLES