ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.
రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు,
వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌కి అభినందనలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి-సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.