జహీరాబాద్ ప్రగతి కోసం ఎల్లవేళల ప్రజల పక్షాన నిలబడతాను అని ఎంపి బీబీ పాటిల్ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో
అఖండ ప్రజాదరణతో ఎంపి బీబీ పాటిల్ దూసుకుపోతున్నారు. పదేళ్లపాటు ఎంపీగా పనిచేసి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని తనకున్న అనుభవంతో తన పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటానని పాటిల్ ఓటర్లకు వివరించారు.
ఆందోల్ నియోజకవర్గం జోగిపేట్ టౌన్ లో మార్నింగ్ వాక్ లో భాగంగా ఇంటింటి ప్రచారంలో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి మరోసారి జహీరాబాద్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.