కాంగ్రెస్ పార్టీ వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారి నాలుక చీరేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హెచ్చరించారు.
హనుమకొండ డిసిసి భవన్ లో వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జి & పరకాల శాసనసభ్యులు పై బిజెపి పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య మరియు సహచర శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. వర్థన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే మాట్లాడుతూ మా పార్టీ అభ్యర్థి మీద పిచ్చి పిచ్చి కూతలు కుస్తే నాలుక చిరేస్తా అని హెచ్చరిస్తూ ఖబర్దార్ మరల వ్యక్తిగతంగా దూషిస్తే మేము నువ్వు చేసిన అక్రమాల మీద ప్రజలకు తెలియజేసి నిన్ను జైలుకు పంపించటం ఖాయమన్నారు. ఖబర్దార్ కబ్జాకోరు అరూరి రమేష్ ఇకనైనా నీ బుద్ధి మార్చుకో అని హెచ్చరించారు. ఈ సమావేశంలో వరంగల్ ఎం.పీ పసునూరి దయాకర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీంద్రరావు, వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నమ్మిండ్ల శ్రీనివాస్, కత్తి వెంకటస్వామి తో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తా
RELATED ARTICLES