Monday, December 23, 2024

భూకబ్జాలు అక్రమాస్తులు కాపాడుకునేందుకు పార్టీ మార్పులు

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నా త్యిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి *వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.

డాక్టర్ కడియం కావ్య కామెంట్స్:

👉బీజేపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది
👉ప్రజలకు ఎం చేసారో, ఎం చేస్తారో చెప్పకుండ నా వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడటం సిగ్గు చేటు
👉కుల మత రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు
👉నేను వరంగల్లోనే పుట్టి పెరిగాను
👉నేను సమ్మక్క సరళమ్మ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను
👉నేను వరంగల్ బిడ్డనే.
👉భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు పార్టీ మారింది నువ్వు.
👉 రాజకీయంగా ఎదుర్కొలేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు.
👉మొన్న అసెంబ్లీ ఎన్నికలలోనే ప్రజలు బుద్ది చెప్పారు… మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తావ్
👉వరంగల్ ప్రజల ఆశీర్వాదంతో వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తా.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్:

👉బీజేపీ నాయకులు సంకుచిత ధోరణితో, మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు.

👉విధానాలపై కాకుకుండా వ్యక్తి గత విషయాలను మాట్లాడటం దిగజారుడు తనానికి నిదర్శనం.
👉కడియం కావ్య ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే ఉద్యోగం చేస్తుంది.
👉నువ్వు ఒక దళితుడు అయి ఉండి ఈవిధంగా మాట్లాడటం సిగ్గుచేటు
👉సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది మతం మారినంత మాత్రాన కులం మారదు అని.
👉ప్రజలను తప్పుదోవ పట్టించాలని మాట్లాడటం దుర్మార్గం.
👉దీనిని తీవ్రంగా ఖండిస్తున్న.
👉నీలాగా భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్, కోట్ల ఆస్తులు సంపాదించలేదు.
👉నా నిజాయితే నాకు పెట్టుబడి.
👉అరూరి రమేష్ నేను టిడిపిలో మంత్రిగా ఉన్నప్పుడు సామాన్య కార్యకర్త
👉నిన్ను క్లాస్ వన్ కాంట్రాక్టర్ చేసింది నేను.
👉కాంట్రాక్టులు ఇప్పించినందుకు నాకు డబ్బులు ఇచ్చావా
👉భహిరంగంగా అడుగుతున్న
👉మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు చేసిన భూ దందాలు ప్రజలందరికి తెలుసు.
👉వెన్నుపోటు పొడిచి పార్టీ మారింది నువ్వు
👉మంద కృష్ణ నా పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు.
👉అందుకు కారణం మంద కృష్ణ చెప్పాలి.
👉మాదిగలకు ద్రోహం చేసింది నేను కాదు మంద కృష్ణ.
బిజెపి పార్టీకి ముస్లిం, క్రిస్టియన్, దళితులంటే గిట్టదు.
👉మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం… రిజర్వేషన్ ఎత్తివేస్తాం అంటున్నారు.
👉రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల పరిస్థితి ఏంటి…
👉బిజెపికి సపోర్ట్ చేస్తున్నావ్ అంటే మాదిగలకు ద్రోహం చేసినట్టు కాదా.
👉ఈ రోజున ఏ రాజకీయ పార్టీ నిన్ను నమ్మే పరిస్థితి లేదు.
👉మాదిగలు, దళితులు ఆలోచన చేయాలి.
👉కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో అవకాశం ఇచ్చింది.
👉అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం.
👉ఎవరెన్ని కుట్రలు చేసిన రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ, కడియం కావ్య నే.
👉బిఆర్ఎస్ పార్టీ నుండి డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే పోటీ నుంచి విరామించుకుంటా.
👉వెదవ మాటలు, లఫుట్ మాటలు మాట్లాడవద్దు.
👉నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి.
👉వరంగల్ అభివృద్ధి చేయడం కోసమే వచ్చాను.
👉పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యం.
👉స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అవసరాలు, అభివృద్ధి కోసమే పార్టీ మారాను.
👉వెన్నుపోటు అనేది నా రాజకీయ చరిత్రలో లేదు.
👉వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు వివేకంతో ఓటు వేసి డాక్టర్ కడియం కావ్యను గెలిపించాలి.
👉నిజాయితీ, నిబద్దతతో వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తుంది.ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular