Sunday, March 29, 2026

మైనర్ బాలికను మోసం చేసిన యువకుడు

ప్రేమ పేరుతో ఓమైనర్ బాలికను మోసం చేసిన యువకుని ఉదంతం ఎడపల్లి మండలంలో చోటు చేసుకున్న ఘటన వెలుగుచూసింది. నిజామాబాద్ పట్టణంలోని గాజుల్ పేట్ కు చెందిన కాంబ్లే సతీష్ అనే యువకుడికి ఇదివరకే వివాహం అయింది.అతనికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు.అయితే ఈవిషయాన్ని దాచిపెట్టి ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16ఏండ్ల మైనర్ బాలికతో ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.పెళ్లి చేసుకొంటానని నమ్మించి లొంగదీసుకొన్నాడు.అయితే ఈవిషయం తెలిసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు గురువారం ఎడపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆయువకునిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular