👉జ్ఞాన జ్యోతి యాత్రకు జనం నీరాజనం…
👉 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే తేడా లేకుండా సబ్బండ వర్గాలతో కలిసి జ్ఞాన జ్యోతి ర్యాలీ…
👉కళాకారులతో డప్పు కొడుతూ దరువు వేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని వరంగల్ ఎంజీఎం సెంటర్ లో జ్ఞాన జ్యోతి యాత్రను వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రారంభించారు. ఈ జ్ఞాన జ్యోతి యాత్రలో ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ నాయకులతో పాటు సబండవర్గాలు ఈ యాత్రలో దాదాపు 2,000 మంది పాల్గొన్నారు. ఎంజీఎం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన యాత్రలో డప్పు కళాకారుల యాత్ర అట్టహాసంగా కొనసాగింది. వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు విరామం లేకుండా కాలినడకన మూడు గంటల పాటు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో ద్విచక్ర వాహనాలతో అంబేద్కర్ అభిమానులు జై భీమ్ జై జై భీమ్ అనే నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. చివరగా అంబేద్కర్ సెంటర్ చేరుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట శాసనసభ్యులు మాట్లాడుతూ జ్ఞాన జ్యోతి యాత్ర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగుతుందని రాబోయే తరం దీన్ని ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.. ఈ జ్ఞానజ్యోతి ర్యాలీ లో ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ, డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.