Monday, December 23, 2024

బాధిత కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న మంత్రి కోమటిరెడ్డి

భర్త చనిపోయిన రెండో రోజే కవలలకు జన్మనిచ్చిన భార్య *పుట్టిన పిల్లలకు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స,* *మానవత్వంతో రూ. లక్ష సాయం పంపిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి**మృతుడి భార్యకు నగదు అందించిన జడ్పీటీసీ పాశం రాంరెడ్డి.వింటున్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించే.. ఓ నిరుపేద దళిత ఆడబిడ్డ కుటుంబం దయనీయ స్థితికి *మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చలించారు*. తిప్పర్తి ఎస్సీ కాలనీకి చెందిన ఆ పేద కుటుంబానికి అండగా నిలిచారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్న చెరుకుపల్లి శ్రీకాంత్.. నిండు గర్భిణీ బీసీ అయిన తన భార్య చికిత్స పొందుతున్న నల్లగొండ ఆస్పత్రికి వెళ్తూ ఇటీవల రాయినిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భర్త చనిపోయిన రెండు రోజులకు శ్రీకాంత్ భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. భర్త మృతితో ఆరోగ్యం దెబ్బతినడంతో పుట్టిన పిల్లలు వెంటనే అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తిప్పర్తి *జడ్పీటీసీ పాశం రాంరెడ్డి ద్వారా తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జరిగిన దారుణం పై చలించారు.* *తక్షణ సాయంగా రూపాయలు 1,00,000/-(ఒక లక్ష రూపాయలు )ఆ కుటుంబానికి పంపించారు.* అంబేద్కర్ జయంతి అయిన ఆదివారం రోజున తిప్పర్తి మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. తాము అండగా ఉంటామని మంత్రి చెప్పారని.. దైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాస్ రెడ్డి ,ముత్తినేని శ్యాంసుందర్, పాశం నరేష్ రెడ్డి, మాజీ సర్పంచులు రొట్టెల రమేష్ జాకటి మోష, మాజీ ఎంపిటిసి కిన్నెర అంజి, ఊట్కూరు సందీప్ రెడ్డి,మాజీ వార్డు మెంబర్లు వంగూరి గిరి, జాకటి భాస్కర్, బత్తుల సోమరాజు, బద్ధం సైదులు , కుక్కల రమేష్ రెడ్డి,పల్లె జానయ్య, చెరుకుపల్లి సురేందర్, కిన్నెర రవి, జానయ్య, వనపర్తి శ్రీరాములు, చింతకుంట్ల నాగరాజు, ఎండి గౌస్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular