భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ భీమ్రావు బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య,సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన చేసినటువంటి కృషి ఈ దేశ ప్రజలు మర్చిపోలేనటువంటి ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని, ఓటు హక్కును అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వ ఈడి, సిబిఐ లాంటి సంస్థలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి బిజెపి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యువతరం దేశ ప్రజలు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఓటు హక్కు తో ఈసారి బిజెపి ప్రభుత్వాన్ని గద్దించాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజల పైన ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యదర్శి వై.ఓమయ్య,సిపిఐ జిల్లా నాయకులు పి నర్సింగ్ రావు , బి రఘురాం, రంజిత్, రాధా కుమార్, భాను, శీను,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు
పీ సీ ఐ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి
RELATED ARTICLES