మద్నూర్ మండల కేంద్రంలో “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ అంటరానితనాన్ని రూపుమాపుటకు సమసమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారన్నారు.రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించారని కొనియాడారు.కొందరు రాజకీయ స్వార్ధపరులు అంబేద్కర్ ని ఒక కులానికి ఒక జాతికి మాత్రమే నాయకుడిగా చిత్రీకరించారని..అంబేద్కర్ అందరివాడని అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యాంగం రచించారాని అన్నారు.ఇకనైనా అంబేద్కర్ జీవితాన్ని అధ్యయనం చేసి ఆయన రచనలు చదివి వారి ఆశయ సాధనకై సమసమాజ స్థాపన కోసం పని చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.