ముఖ్యమంత్రిని కలిసిన కాసుల రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును ప్రభుత్వం నియమించింది. ఆనాటి నుండి ప్రతినిత్యం కాసులను సన్మానించేందుకు ప్రతి ప్రతిరోజు బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన వారే కాకుండా ఉమ్మడి నిజాంబాద్ జిల్లా నుండి ఎందరో ఆయన నివాసానికి చేరుకొని క్యూ కడుతున్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు మనం గంగాధర్ వారి మిత్రబృందంతో ఘన సన్మానం చేశారు.బాన్సువాడ పట్టణంలోని. బీసీ సంక్షేమ సంఘము తరుపున రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ హాజీ మియా , నియోజక వర్గ అధ్యక్షులు ఇందూరి సంజీవులు మండల అధ్యక్షులు శ్రీధర్ ,’మాజీ మండల అధ్యక్షులు జీవన్ , శ్రీనివాస్ యాదవ్ , చందు యాదవ్ , హన్మాండ్లు , సాయిలు ,విట్టల్ , శ్రీనివాస్ చారి సాయిరాం , జిన్నా శంకర్ , సభ్యులు తదితరులు పాల్గొన్నారు.సీఎంను కలిసిన కాసుల బృందం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి బంగపాటు గురయ్యారు. అయినప్పటికీ నిరుత్సాహం చెందకుండా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని తన వంతు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకడుగు వేసేది లేదు అంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో టికెట్లను కొంతమందికి ఇవ్వలేకపోయారు. గతంలో కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులకు గురైన వారికి న్యాయం చేసి తీరుతానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. తన హామీని నిలబెట్టుకునే భాగంలోనే రాష్ట్రంలోని పలువురికి కార్పొరేషన్ పదవులను ప్రకటించారు. కార్పొరేషన్ పదవి సీఎం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గం లోని పలువురు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రుని కలిశారు. ఇప్పటికే తనకి ఎవరు అవుతున్న రాజకీయ ఇబ్బందులను సీఎం ముఖ్య అనుచరుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తుంది. శనివారం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.
