Monday, May 11, 2026

త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం

* రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి చెయ్యడమే మన లక్ష్యం * రాష్ట్రం లో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు* పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో బిజెపి చెప్పి మాట తప్పింది* రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ లు అమలు చేశాం * బీజేపీ 10 యేండ్ల పాలనలో దేశాన్నిలూటీ చేశారు.ఆసీఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండ‌లం ప్ర‌చారంలో మంత్రి సీత‌క్క‌పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని రెబ్బెన మండలంలో *పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క* క‌ర‌ప‌త్రాలు పంచుతూ ఇంటింటి ప్ర‌చారం చేశారు. వీధుల వెంట తిరుగుతూ ప్ర‌జ‌ల‌తో మ‌మేకమై, వారితో క‌లిసి వారు చేసే ప‌నుల‌కు స‌హాయ‌ప‌డ్డారు. అనంత‌రం మండ‌ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అస్రం సుగుణ‌ను భారీ మెజార్టీ తో గెలిపించాలని ఇంఛార్జి లు, పార్టీ నాయ‌కులు క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సమన్వయ పరుస్తూ పార్టీని బలోపేతం చేయాలని వారికి సూచించారు.రాహుల్ గాంధీ ఏనాడూ ఆయ‌న ప‌ద‌వికి అశ‌ప‌డ‌లేద‌ని అన్నారు. ప్రజ‌ల‌ను ప్రేమించ‌డం, ప్రజ‌లంద‌రిని క‌లిపి ఉంచ‌డ‌మే రాహుల్ గాంధీ గారి లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటిలను పక్క అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం అమలు చేశామని గుర్తు చేశారు. బీజేపి ప్ర‌భుత్వ హ‌యాంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బ‌తికే ప‌రిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాల‌కులుగా ఉన్నవారే ఘ‌ర్షణ‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నార‌ని అన్నారు. బీజేపీకి దేశ ప్రయోజనాల కంటే.. సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. బీజేపీ పాలనలో.. దేశం తిరోగమనం బాట పట్టిందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular