నామ నాగేశ్వరరావు పాత స్మృతులు తనకు బాగా చదువుకోవాలని కోరిక ఉన్నా చదవలేక పోయానని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఆవేదనగా చెప్పారు. అందుకే తాను చదువుకోలేక పోయినా, ఇప్పటి తరం పిల్లలు ఆర్థిక సమస్యల వల్ల వారి చదువు ఆగిపోవద్దనే ఉన్నతాశయంతో తాను ఎందరో విద్యార్థుల చదువుకు తాను ఆర్థిక సహాయం అందిస్తున్నానని నామ పేర్కొన్నారు. శనివారం మధిర నియోజకవర్గం పరిధిలోని ముదిగొండ మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో నామ పాల్గొని ప్రసంగించారు. నామ పార్లమెంటు గ్రంథాలయం ఛైర్మన్ గా దాన్ని బాగా తీర్చిదిద్దారని, దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతులతో కూడిన పుస్తకాలను రప్పించి పార్లమెంటు లైబ్రరీలో అందుబాటులో ఉంచారని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. తాము నామ ఆహ్వానం మేర ఢిల్లీ వెళ్లి నామ గారు పార్లమెంటు లైబ్రరీని అభివృద్ధి చేసిన వైనాన్ని తాము స్వయంగా చూశామని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. *నేను గొడ్లకు పోవాల్సి వచ్చింది*…‘‘నేను డిగ్రీ డిస్ కంటిన్యూ చేశాను, డిగ్రీ చేయలే… ఇంటర్ మీడియెట్ పాసయ్యాను. అంతే మా నాన్న చెప్పిండు మా నాన్న రైతు. ఇద్దరు పెద్ద జీతగాళ్లు, ఒకరు గొడ్ల జీతగాడు ఉంటాడు ప్రతీ సంవత్సరం 8వతరగతి పాసైనప్పుడు నాకు 19 సంవత్సరాలే. బాలశిక్ష కూడా చదివినా, రెండు సంవత్సరాలు రెండేసి తరగతులు పాసయ్యాను. తర్వాత 5వ సంవత్సరం తీసుకుపోయి గవర్నమెంట్ స్కూలులో వేసిండ్రు…నా ఖర్మ కాలి ఆ సంవత్సరం గొడ్ల జీతగాడు దొరకలా. నీవు గొడ్లకు పోవాల్సిందే అని మా నాన్న చెప్పిండు.,అంతే నాన్న వాక్కు వేదవాక్కు. వయసు 13 సంవత్సరాలు 20, 25 ఎకరాల భూమి ఉంది కాని గొడ్ల జీతగాడు దొరకలా…గొడ్లకాడికి వెళ్లాను. ఇద్దరు పెద్ద జీతగాళ్లు, మధ్యతరగతి కుటుంబం ఇబ్బందేమీ లేదు కానీ గొడ్లకు వెళ్లడం మొదలు పెట్టినా….బీడు భూములు అక్కడ చేసేదేమీ లేదు…ఒక రోజు ఆలోచించి 11 సంవత్సరాలకే ఇంట్లో నాన్నకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయాను. చదవాలని కోరిక ఉన్నా చదవలేక పోయినా అదొక చరిత్ర…అలా కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగాను. నా జీవిత చరిత్ర ప్రజలందరికీ స్ఫూర్తి దాయకం కావాలి’’ అని నామ నాగేశ్వరరావు వివరించారు.*ఓటర్లు కాంగ్రెస్ పాలకులను నిలదీయాలి* ‘‘మీరు ఓటర్లను అడగండి రైతుబంధు 15వేల రూపాయలు ఇచ్చి ఓటు అడుగు అని కాంగ్రెస్ నేతలను నిలదీయాలని నామ కార్యకర్తలకు సూచించారు. కల్యాణ లక్ష్మీ తులం బంగారం అడగండి గ్యారంటీల మీద అడగండి ఏ బూత్ ఆ బూత్ బూత్ కమిటీ, గ్రామ నాయకులు ఓటర్ల వద్దకు వెళ్లి గ్యారంటీలను అమలు చేయలేదని సర్కారు గురించి వివరించి చెప్పాలని నామ నాగేశ్వరరావు ఉద్వేగంగా కార్యకర్తలను ఉద్ధేశించి కోరారు. కేసీఆర్ గారికి అండగా ఉండాలని కార్యకర్తలను కోరారు. కార్యకర్తల బలంతో ఖమ్మం జిల్లా చరిత్రను తిరగరాయాలని నామ కార్యకర్తలను కోరారు. *జాతీయ రహదారులను నిర్మించా*…ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో నేను పార్లమెంటుకు వెళ్లా, నేను ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి, తెలంగాణ గురించి తాను ఆలోచిస్తానని నామ చెప్పారు. తాను ఎంపీ కాకముందు ఖమ్మం జిల్లాలో ఒక్క హైవే లేదని, కానీ తాను ఎంపీ అయ్యాక తాను రాసిన లేఖలు, పార్లమెంటులో చేసిన పోరాటంతోనే జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి పోరాడి జాతీయ రహదారులను నిర్మించానని నామ పేర్కొన్నారు. ఈ సమావేశం లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్సీ, జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మండల పార్టీ అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, నాయకులు పోట్ల ప్రసాద్, మీగడ శ్రీనివాస్ యాదవ్, బంకా మల్లయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, అనంతరెడ్డి, ఎర్ర వెంకన్న, తోట ధర్మ, కొమ్మూరి స్వాతి, వీరారెడ్డి, భిక్షం, కోడే బాబు, పర్సా సీతారామయ్య, పంది శ్రీను, రాజా సహ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చదువుకోవాలనే కోరిక ఉన్నా చదవలేక పోయాడిగ్రీ డిస్ కంటిన్యూ చేశా…
RELATED ARTICLES