Tuesday, December 24, 2024

సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

133వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొనినిజాంబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ భారత పాలకులు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో పాశ్చాత్య సంస్కృతి ద్వారా మనువాద సిద్ధాంతాన్ని అమలు జరపాలని రాబోయే ఎన్నికల్లో మూడోసారి గెలిపించి ప్రధానమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నారని, భారత ప్రజలందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని ప్రజల్లో మత విద్వేషాలను పెంచి బిజెపి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల్లో ఉన్న తారతమ్యాలను తొలగించి అందరూ కలిసి మెలిసి ఉండాలని అంటరాని తనం పేద గొప్ప అనే తేడా ఉండకూడదని బిఆర్ అంబేద్కర్ సమానమైన హక్కులను కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తే నేటి పాలకులు ప్రజల్లో విద్వేషాలను పెంచి పాశ్చాత్య సంస్కృతిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిప్పి కొట్టినప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చిన వాళ్ళo అవుతామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకై అందరూ ఐక్యంగా కదలాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు పి సూరి, విగ్నేష్, నగర నాయకులు కటారి రాములు, నల్వాల నరసయ్య, మహేష్, కృష్ణ, దీపిక, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular