బాన్సువాడ పట్టణంలో సోమవారం ఉదయాన్నే మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పలు వీధుల్లో పర్యటించారు
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో మౌలిక వసతులు కల్పించేందుకు మరిన్ని నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తానని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తేవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు అందించి తీరుతామని ఆయన వివరించారు. రాబోయే ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బాన్సువాడ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ సాధించి తీరుతామని ఏనుగు ధీమా వ్యక్తం చేశారు.