
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతానని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలుపుతానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు స్పష్టం చేశారు.
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి పటేల్ మరియు హనుమంత్ యాదవ్ ఆధ్వర్యంలో మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామం నుండి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు యువ నాయకులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.మరియు బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామం నుండి గ్రామ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి మరియు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సాయిలు ,బూమయ్య మాజీ సర్పంచ్,వార్డు సభ్యులు రమేష్ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
