రైతు రుణాలు మాఫీ చేసి తీరుతాం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రస్తుత ఎంపీ అరవింద్ జిల్లా ప్రజలను మోసం చేశారని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ మీద రైతులకు రాసి ఇచ్చి నేటి వరకు కార్యరూపం దాల్చలేదని ఎమ్మెల్సీ, ప్రస్తుత పార్లమెంట్ నిజాంబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంబాద్ పట్టణంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లపాటు కాలయాపన చేసిన అరవింద్ జిల్లా ప్రజలకు వరగబెట్టిందేమీ లేదని తెలంగాణ రాష్ట్రంలో వైశాల్యంలో ఆదాయంలో పెద్ద పట్టణ మైనటువంటి నిజాంబాద్ ను స్మార్ట్ సిటీగా చేయలేకపోయారని, కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రభుత్వం ప్రకటించిందని మరోసారి నిజాంబాద్ పార్లమెంట్ ప్రజలను మోసం చేయడానికి అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతంగం అప్పుల ఊబిలో కూరుకుపోయారని కాంగ్రెస్ ప్రభుత్వం పంటల రుణమాఫీ చేసి తీరుతుందని, జాతీయస్థాయిలోను కాంగ్రెస్ పార్టీ రుణమాఫీకి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు నేటి వరకు ఆచరణకు శ్రీకారం చుట్టూ లేదన్నారు. పసుపు బోర్డు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నాము అన్న విషయాన్ని బిజెపి ప్రభుత్వం నేటికీ స్పష్టం చేయలేకపోయింది అన్నారు. ప్రస్తుత ఏడాది పసుపు సాగు తగ్గడం దిగుబడులు తగ్గడంతో పసుపు మార్కెట్లో క్వింటాళ్లు 15000 రూపాయలకు వ్యాపారులు చేస్తున్నారన్నారు. రైతు ఉత్పాదన ధరలకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని పెట్టుబడులు రెట్టింపు చేసి ఆదాయాన్ని పెంచలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకొస్తే పసుపు క్వింటాళ్లు 15 వేల ధర కల్పిస్తూ చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం రైతులకు ఎకరాకు 6000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తుందని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు పంటకు 7500 వేల రూపాయలు అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాను రైతు కుటుంబంలో జన్మించి నేటికీ వ్యవసాయాన్ని తన వృత్తిగా చేస్తున్నానని రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా తనను గుర్తిస్తే రాబోయే కాలంలో రైతు సమస్యలను పరిష్కరించి తీరుతానని జీవన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఏడాదిగా రైతులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏ ఒక్కనాడు బిజెపి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ మార్కెట్ ధరలు తగ్గినప్పటికీ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశానికి అంతే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు బతుకు భారంగా మారిందని ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నాయని, పేదలు దేశంలో మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. గాయాలు దేశం పాకిస్తాన్ తలలు వంచింది. ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నాని 71 లో ప్రత్యక్షంగా యుద్ధం కూడా ప్రకటించారని గుర్తు చేశారు. 1967లో ప్రధాని చైనాపై యుద్ధం కూడా ప్రకటించారు. ఎంతో చరిత్ర గల కాంగ్రెస్ గాంధీల కుటుంబాల విషయంలో రాజకీయ పార్టీలు రాజకీయ లాభం చేకూర్చుకునే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని జీవన్ రెడ్డి ఖండించారు. దేశంలో 66 కాయలపడ్డ కర్మకారాలు పున ప్రారంభించామని పదేపదే ఎంపీ అరవింద్ చెప్పడం పట్ల జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు చక్కర కర్మాకారాలు మూత పడ్డాయని రైతులు కార్మికులు బజారున పడ్డారని ఏనాడు పట్టించుకోని అరవింద్ రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బోధన్ జగిత్యాల ప్రాంతంలో ఉన్న చక్కెర కర్మాగారాలను 25 డిసెంబర్ నాటికి తెరిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పేరిట కెసిఆర్ ప్రభుత్వం 100 అవకాశం ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రజలు తమ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయమని ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలు పరిష్కరించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే ప్రయత్నంలో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో రైతు రుణాలను మాఫీ చేసిందని, రాబోయే రోజుల్లో మరోసారి రైతు రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం చేయబోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, వర్క్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటుతోపాటు 15000 ధర కల్పిస్తాం
RELATED ARTICLES
