
నందిపేటలో వినయ్ రెడ్డి ప్రచార హోరు
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల ను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని పేదలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ కుమార్ ప్రజలకు భరోసా ఇచ్చారు. పలు గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార హోరును ఆయన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించుకుని తీరి ఆర్మూర్ అభివృద్ధికి ప్రజల సహకరించాలని పిలుపునిచ్చారు.నందిపేట మండలం చింరాజు పల్లి గ్రామంలో మన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి ని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి రైతు నాయకులు ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు పథకాలలో నాలుగు పథకాలను అమలుపరుస్తూ రానున్న రోజుల్లో మిగతా రెండు పథకాలు కూడా అమలు చేస్తారని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం కింద సిలిండర్ 500 రూపాయలకు, ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, రానున్న రోజులలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది ,నాది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట మండల అధ్యక్షులు మంద మైపాల్ గారు,చి౦రాజ్ పల్లి ఎంపిటిసి శ్రీనివాస్ ,మాజి సర్పంచ్ గణేష్ , డిసిసి ఉపాధ్యక్షులు కంఠం ఇంద్రుడు ,దెగాం గంగారెడ్డి, చీoరాజ్ పల్లి PACS సొసైటీ ఛైర్మెన్ బొంకమ్ గంగారెడ్డి ,మారంపల్లి లిఫ్ట్ ఛైర్మెన్ భోజ రెడ్డి ,సొసైటీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ , డొంకేశ్వర్ మాజి సర్పంచ్ చందు ,తొండకూర్ మాజి సర్పంచ్ దేవన్న గారు, ,తల్వేద మాజి సర్పంచ్ సాయినాథ్ గౌడ్,డొంకేశ్వర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి ,వన్నెల్ కె మాజి విండో ఛైర్మెన్ లోక హన్మాండ్లు గారు,ఐలాపూర్ విండో మాజి ఛైర్మెన్ లక్ష్మీ నారాయణ ,డొంకేశ్వర్ మాజి సర్పంచ్ హరి దాస్ , నడకూడ మాజి సర్పంచ్ బంటు సంజీవ్ ,మాన్పుర్ భూమేష్ , కొండూరు పోశెట్టి ,గంగ సాయులు,మల్లు మురళి, దిపేట్ మండలం మైనారిటీ అధ్యక్షులు యూసుఫ్ ,ఉమ్మెద బీజన్న ,గంగాధర్ తల్వేద శ్రీనివాస్ , మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
