Wednesday, February 11, 2026

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఇందుప్రియ

కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా గడ్డం ఇందు ప్రియా ఎన్నికయింది.
కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్ లు మర్యాద పూర్వకంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. గులాబీ పార్టీ రోజుకో ప్రజా ప్రతినిధి స్థానాన్ని కోల్పోతుంది. గులాబీ వర్గ విభేదాలు తారాస్థాయి కి చేరినేడు కామారెడ్డి బల్దియాను చేజార్చుకుంది. శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఓటమిపాలయ్యాయి. అనూహ్యంగా బిజెపి పార్టీ అభ్యర్థిగా రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో స్థానిక పదవుల్లో కాంగ్రెస్ పార్టీ చెందిన వారే ఉండి తీరాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ ఆలీని నియమించారు. తన పట్టును కోల్పోకుండా షబ్బీర్ అలీ మంచి ఉన్నత స్థానాన్ని చే జిక్కించుకోగలిగారు. కామారెడ్డి బల్దియా పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అన్న దృఢ సంకల్పంతో షబ్బీర్ అలీ రాజకీయ ఎత్తుగడలను వేశారు. ఎట్టకేలకు కామారెడ్డి బల్దయా కథ నేటితో ముగిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular