
గులాబీ జలములో ఉత్సాహాన్ని నింపిన పోచారం
జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ మరియు బాన్సువాడ రూరల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్ లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న MP అభ్యర్థి గాలి అనీల్ కుమార్, బాన్సువాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బంజారా సేవా సమితి జిల్లా అధ్యక్షులు బద్యానాయక్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
*ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలో బాన్సువాడ పట్టణంలోని 28 బూతులలో బి ఆర్ ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. డబుల్ బెడ్ రూం ఇళ్ళ కాలనీ వాసులు వెయ్యి ఓట్ల మెజారిటీ ఇచ్చారు. అదేవిధంగా బాన్సువాడ రూరల్ మండలంలో కూడా 6000 ఓట్ల మెజారిటీ వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విదంగా మెజారిటీ ఇచ్చి ఉంటే BRS ప్రభుత్వం మళ్ళీ వచ్చేది.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఆశపడి ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు.అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదు.
రైతుబంధు ఎకరాకు రూ. 15,000,
కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు.అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు.
రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు.ఇందులో ఏది కూడా అమలు చేయడం లేదు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి. కర్రు కాల్చి వాత పెట్టాలి అని పోచారం పిలుపునిచ్చారు.పాలిచ్చే బర్రెకు గడ్డి వేయకుండా గొడ్డు బర్రెకు గడ్డి వేసినట్లు ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు.బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరైతే అందులో 10,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించుకున్న లబ్ధిదారులకు BRS ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించాను.
ప్రభుత్వం మారిన తరువాత పెండింగ్ లో ఉన్న రూ. 26 కోట్ల బిల్లులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మంత్రిని కోరితే, నా మీద బాన్సువాడ లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు ఆ మంత్రి దగ్గరకు వెళ్ళి బిల్లులు ఇవ్వొద్దని చెప్పాడట.
ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అంటున్నారు.
2004 నుండి 2009 మద్య బాన్సువాడ నియోజకవర్గంలో 24,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించామని కాంగ్రెస్ నాయకులు దొంగ బిల్లులు ఎత్తుకున్నారు. దొంగలు కలిసి పంచుకున్నారు.గతంలో నా వెంట ఉన్న కొంతమంది నాయకులు రెండు, మూడు లక్షల రూపాయలకు ఆశపడి ఈమధ్య కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళారు. వాళ్ళు స్వార్థం కోసమే పార్టీ మారారు.
బాన్సువాడ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఏడు సార్లు గెలిపించారు.
Iనన్ను ఇన్నాళ్లూ ఆదరించిన, అభిమానించిన ప్రజలకు నా తర్వాత కూడా అండ ఉండాలనే ఉద్యేశంతో పోచారం భాస్కర్ రెడ్డి ని నా వారసుడుగా నిలబెట్టాను. ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రొటోకాల్ లో లేని వ్యక్తులు ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారికంగా పాల్గొంటూ అల్లరి, చిల్లర పనులు చేస్తున్నారు.
మర్యాదగా ఉండాలి, మంచి పనులు చేయాలి. రెచ్చగొట్టే పనులు చేస్తే మాత్రం ఊరుకోం అని హెచ్చరిస్తున్నా.
జహీరాబాద్ టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ మంచి మనిషి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మొదటి నుండి కేసీఆర్ తో ఉన్నారు.
బోదన్ నుండి బాన్సువాడ మీదుగా పటాన్ చెరువు వరకు నూతన రైల్వే లైను వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది.
గాలి అనిల్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాదిస్తే ఈ రైల్వే లైన్ నిర్మాణం సాకరం అవుతుంది.అందరం కారు గుర్తుపై ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి.
