Wednesday, February 11, 2026

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుం డడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు.

ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు.
సాధారణ పోలింగ్‌‌కు నాలుగు రోజుల ముందు గానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
దీంతో ఈ దిశగా అధికా రులు అడుగులు వేస్తు న్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణను నెల 30న మొదలు పెట్టి రెండో తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం నిర్ణయించినట్టుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రిం చనున్నాయి.కాగా ఈవీఎం యంత్రాలపై ఉంచే బ్యాలెట్‌ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించా లని అధికారులు నిర్ణయిం చారు.85 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించు కునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిం చిన విషయం తెలిసిందే.
వృద్ధులతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు, దివ్యాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృ ద్ధులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికా రులు ఏర్పాట్లు చేయను న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular