Wednesday, February 11, 2026

ఏసీబీకి చిక్కిన పోలీస్ తిమింగలం

ఆసిఫాబాద్ ఎస్సై 25 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం

కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా
అసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఎసై గా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి 25000 వేల లంచం తీసుకుంకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీపీ డిఎస్పీ రమణ మూర్తి మాట్లాడుతూ కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో గత నెల 31 వ తేదీన బూరుగుడ సమీపంలో కారు మరియు ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం జరిగినది. ప్రమాదంలో నిందితుడైన యాహిహా ఖాన్ మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ వాసి. అతనికి స్టేషన్ బెయిల్ మరియు వాహనము ఇవ్వడానికి ఆసిఫాబాద్ స్థానిక ఎస్సై రాజ్యలక్ష్మి 40 వేలు డిమాండ్ చేయగా 25 వేలకు సెటిల్మెంట్ తో బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని సంప్రదించాడు. ఏసీబీ ని సంప్రదించాక ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటలకు 25వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసిబి డిఎస్పి రమణమూర్తి కి పట్టుబడింది. డి.ఎస్.పి ఏసిబి డిఎస్పి రమణమూర్తి మాట్లాడుతూ ఎస్సై రాజలక్ష్మిపై కేసు నమోదు చేసి కరీంనగర్ లోని కోర్టుకు హాజరు పరుస్తామని తెలియజేశారు.
ఈ క్రమంలోనే పట్టుపడ్డ డబ్బులు పింక్ బాటిళ్లు ఎసై ని మీడియా ముందు చూపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular