పండిన పంటను కొనుగోలు చేయడం లేదు
కరెంట్,తాగునీళ్ల కటకటతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ వాళ్లను హామీల అమలు గురించి నిలదీయండి
కష్టజీవి,స్పూర్తిదాయకులు బీఆర్ఎస్ అభ్యర్థి నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం
*కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే కుట్రల్ని కేసీఆర్ పటాపంచలు చేశారు
ఎంపీ రవిచంద్ర
లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావులతో కలిసి పాల్వంచలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోయి,పండిన పంటలను కొనుగోలు జరగడం లేదు,దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కరెంట్,సాగు,తాగునీళ్ల కటకటతో ప్రజలు, రైతులు,మహిళలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.
బీఆర్ఎస్ పక్ష నేత, పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు,మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులతో కలిసి పాల్వంచ సమావేశంలో ప్రసంగించారు.సోమవారం ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగాలన్నారు.
జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”,”నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటేసి గెలిపిద్దాం”అనే నినాదాలు మిన్నంటాయి.ఎంపీ వద్దిరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ,తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదినది ఈ గడ్డనేనని,సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలనే కుట్రల్ని మహానేత కేసీఆర్ పటాపంచలు చేశారని గుర్తు చేశారు.అలాగే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కూడా కేసీఆర్ అడ్డుకున్నారని వివరించారు.కష్టజీవి,స్పూర్తిదాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం,దక్షత కలిగిన బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును మనమందరం కలిసికట్టుగా భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.
