Wednesday, February 11, 2026

చందూరు లో కదంతొక్కిన కాషాయ దళం

బీబీ పాటిల్ సమక్షం లో భారీ చేరికలు బైక్ ర్యాలీ

జహీరాబాద్ గడ్డపై
కాషాయ జెండా

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని
బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మండల కేంద్రంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. అనంతరం బీబీ పాటిల్ సమక్షం లో 150 మంది బిజేపీ లో చేరారు.ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ… జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ను అభివృద్ధి చేశానని,ఇంకా పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే మరోసారి ఎంపీ గా గెలిపించాలని పేర్కొన్నారు. దేశంలో మోడీ హవా నడుస్తోందని, ఈ పదేళ్లలో మోడీ దేశ ప్రతిష్టను ప్రపంచ నలుమూలల చాటారని అన్నారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ,బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, బాన్సువాడ అసెంబ్లీ కో కన్వీనర్ కాపు గాండ్ల శ్రీనివాస్, చందూరు మండల అధ్యక్షులు మాడిశెట్టి విటల్
రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సంగం గంగాధర్ గౌడ్,జిల్లా కార్యదర్శి పైడిమల్ లక్ష్మీనారాయణ
జిల్లా అధికార ప్రతినిధి చందూరు హనుమాన్లు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular