నివాళులర్పించిన మంత్రులు ఇతర ప్రముఖులు






టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మాతృమూర్తి యాష్కి అనసూయ గారు (85) ఈరోజు ఉదయం పరమాపదించారు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని మధుయాష్కి గౌడ్ ఇంట్లో ఎలాంటి కదలికలు లేని స్థితిలో ఉన్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో కూడిన అస్వస్థతో బాధపడుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు బంజారాహిల్స్ లోని ఇంట్లోనే ఆమె పార్దివదేహాన్ని ఉంచారు. జాతీయ నేతగా ఎదిగేందుకు చిన్నప్పటి నుంచి తనకు నేర్పిన క్రమశిక్షణ, ఉన్నత చదువులు చదివేందుకు అందించిన ప్రోత్సాహాన్ని మధు యాష్కి గౌడ్ గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.
ప్రముఖుల నివాళి
ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రివర్యులు సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ మంత్రి రాజేశం గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామేలు , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, , కార్పొరేషన్ల చైర్మన్లు మల్ రెడ్డి రామ్ రెడ్డి, నూతి శ్రీకాంత్ గౌడ్, ఫహీం, గీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ లతో పాటు మధుయాష్కి గౌడ్ స్నేహితులు, అభిమానులు తదితరులు వచ్చి అనసూయమ్మ పార్దివ దేహానికి నివాళులర్పించారు. మధుయాష్కి గౌడ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి
మధుయాష్కి గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ మరణం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇతర మంత్రులు, ప్రముఖులు కూడా సంతాపాన్ని ప్రకటించారు.
పార్థివ దేహాన్ని సాయంత్రం 4 గంటలకు హయత్ నగర్ లోని పాత ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బంధువులు, పాత హయత్ నగర్ గ్రామస్తులతో పాటు ఎల్బీనగర్ నియోజకవర్గ నాయకులు హాజరై నివాళులర్పించారు. సాయంత్రం 6.30 గంటలకు హయత్ నగర్ రేడియో స్టేషన్ పక్కన ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.
