Wednesday, February 11, 2026

భద్రాద్రి గోదావరి 2వ వంతెనపై రాకపోకల ప్రారంభం


ఖమ్మం జిల్లా :ప్రతినిధి

ఖమ్మం జిల్లా:ఏప్రిల్ 16

భద్రాద్రి వాసుల కష్టాలు సగం తీరినట్టే. గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెన ప్రారంభమైంది.కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజ్‌ ప్రారంభించగా.. ఉన్నతాధికారులు నూతన వంతెనపై తమ వాహనాలు నడిపారు. మిగతా వాహన దారులు సారపాక వైపు నుంచి భద్రాచలం వైపునకు రాకపోకలు సాగించారు.2015 ఏప్రిల్‌ 1వ తేదీన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, అప్పట్లో రాష్ట్ర రహదారు లు, భవనాల శాఖామంత్రి గా ఉన్న తుమ్మల నాగేశ్వర రావు ఈ వంతెనకు శంకుస్థా పన చేశారు.అనంతరం వివిధ కారణా లతో నిర్మాణం జాప్యం కాగా.. ఇటీవల మళ్లీ మంత్రి పదవి చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు పనులను పూర్తి చేయించేందుకు చొరవచూపారు.

శ్రీరామనవమికల్లా కొత్త వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించ డంతో అధికారులు పనులు వేగవంతం చేయించారు. ఇప్పటికే ఉన్న పాత బ్రిడ్జితో పాటు దీన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులు, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.వంతెన అందుబాటులోకి రావడంతో భద్రాచలం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రవాణా సమస్య కాస్త తీరినట్టేనని అంటున్నారు. శ్రీరామనవమి దర్శనానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తీరాయని చెబుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular