Wednesday, February 11, 2026

జయశంకర్ భూపాలపల్లి జిల్లాపై ఐజీ రంగనాథ్ స్పెషల్ ఫోకస్

భూపాలపల్లి జిల్లా:ఏప్రిల్ 16


జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న సంఘటనలపై మల్టీ జోన్ 1 ఐజి రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు.పోలీసుల పనితీరు పై వస్తున్న ఆరోపణలు తన దృష్టికి వెళ్లిన వెంటనే తక్షణమే స్పందిస్తూ బాధ్యులపై శాఖ పరమైన చర్యలకు అదేశిస్తున్నారు.ఇటీవల మొగుళ్లపల్లిలో ఓ రౌడి షీటర్ జన్మదిన వేడు కలు ఠాణాలో జరుపగా వెంటనే స్పందించి సంబం ధిత ఎస్సై పై శాఖాపరమైన చర్యలు చేపట్టి ఆసిఫాబాద్ జిల్లాకి బదిలి చేశారు.తాజాగా సోమవారం మహా దేవపూర్ లో జరిగిన ఘట నపై స్పందించి సంబంధిత ఎస్సై ప్రసాద్ ను విఆర్ కు బదిలీ చేయగా , హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు.అదేవిధంగా స్టేషన్ పరిధిలో వున్న మరో 7గురి ఒక హెడ్ కానిస్టేబుల్ పాటు మరో ఆరుగురి సిబ్బంది పై బదిలి వేటు వేశారు. దీంతో జిల్లా లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో అలజడి మొదలైంది.ఐజి తీసుకుంటున్న శాఖ పరమైన చర్యలతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular