కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలు
వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సమక్షంలో చేరికలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లే లక్ష్యంగా భారీ చేరికలు..
పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వర్థన్నపేట నియోజవర్గంలో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. 43వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రకాష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను మరియు గౌడ సంఘం నాయకులు సుమారుగా 100 మంది వర్థన్నపేట శాసనసభ్యులు నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు ప్రజలను మోస పూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెల్లదీశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరోపించారు.పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ని భారీ మెజారితో గెలిపించి వరంగల్ గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
